పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కొంతమంది టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్తున్న వైసీపీ నేతలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో టీడీపీ కార్యకర్తలు కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కారుపై దాడి చేశారు. కర్రలతో దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.