పహల్గాం ఉగ్ర దాడి ఘటన తర్వాత కూడా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన 26 మందిని పొట్టనబెట్టుకున్న తర్వాత కూడా.. అలా మాట్లాడాలనుకుంటే పాకిస్థాన్‌కే వెళ్లిపోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చశారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్.. మత ప్రాతిపదికన చంపడం దారుణమని మండిపడ్డారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని.. ఇలాంటి విషయాలపై కొంతమంది కాంగ్రెస్ నేతలు ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని పవన్ కళ్యాణ్ సూచించారు.