Pawan kalyan interaction With Tribals in manyam District: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. పలు గిరిజన గ్రామాలలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, స్థానికులు పవన్ కళ్యాణ్‌ను చూడటానికి పోటెత్తారు. దీంతో అభిమానులు, స్థానికులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తాను వచ్చినప్పుడు ఇలా చుట్టుముట్టవద్దని.. తనను పని చేసుకోనివ్వాలని కోరారు. తాను మీసం తిప్పితేనో, ఛాతీ కొట్టుకుంటేనో పనులు జరగవని.. సమస్యలు పరిష్కారం కావాలంటే తనను పని చేసుకోనివ్వాలని కోరారు.