రామ్‌గోపాల్ వర్మ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా రామ్‌గోపాల్ వర్మ కనిపించకుండా పోవటం గురించి ఢిల్లీలో మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మతో పాటుగా పలువురు నోటీసులు తీసుకుని విచారణకు రావడం లేదన్న పవన్.. ఆ విషయంలో తానేమీ మాట్లాడబోనని అన్నారు. అది హోంశాఖ పరిధిలోని అంశమన్న పవన్ కళ్యాణ్.. పోలీసులు వారి పని వారు చేస్తారన్నారు. తన శాఖ పరిధిలోని అంశాలపై మాత్రమే మాట్లాడతానంటూ స్పష్టం చేశారు.