పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. తాజాగా ఈ చిత్రం నుంచి 'మాట వినాలి' అంటూ సాగే మొదటి గీతాన్ని నిర్మాతలు ఆవిష్కరించారు. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం విశేషం.