ఏపీ ప్రభుత్వం ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటున్నారన్నారుమాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన స్పందించారు. తాము ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసని.. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశామన్నారు. అయినా తన భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారన్నారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసిందన్నారు. ఇప్పుడు తన భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారన్నారు. తన భార్యను, తన కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని.. ఆఖరికి జైలుకు అయినా పోతామన్నారు. అంతేగానీ వైఎస్సార్‌సీపీనుంచి తప్పుకునేది లేదని.. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటామన్నారు.