ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ శుభవార్త అనే చెప్పాలి. తెలంగాణలో కార్యాలయాల సెంటర్లు పెరుగుతండటం.. పీఎఫ్ విత్ డ్రా చేసే ప్రక్రియ మరింత సులభతరం కావడంతో ఎంతో సంతోషించదగిన విషయం. ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన త్వరలోనే రానుందని.. దీనిని బ్యాంకింగ్ తరహాలో తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి మాండవీయ తెలిపారు. బేగంపేట బ్రాహ్మణవాడిలో నిర్మించిన ఈపీఎఫ్‌ఓ కార్యాలయం ప్రారంభించిన ఆయన ఈ మేరకు ఈ విషయాలను వెల్లడించారు. రాామగుండంలో త్వరలోనే ఈఫీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు కానుంది.