Ponguleti: తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్‌డేట్ వెల్లడించారు కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండగ కానుకగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 32 లక్షల మంది కుటుంబాల సర్వే పూర్తి చేసి యాప్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.