సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అస్వస్థతకు గురయ్యారు. పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన శనివారం అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో అధికారులు వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోసాని కృష్ణ మురళికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. డాక్టర్లు వివిధ రకాల టెస్టులు చేస్తున్నట్లు తెలిసింది.