సినీ నటుడు, పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజంపేట తరలిస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఏపీ సీఐడీ కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.