విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఓబుళాపురం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్డు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ఇక పోసాని కృష్ణ మురళి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. వర్గాలు, కులాలపై తాను తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పోసాని అంగీకరించారని సమాచారం. వైసీపీకి చెందిన ముఖ్య నేత సూచనల మేరకే విమర్శలు చేశానని పోసాని పోలీసులతో చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.