ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలపై నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బృందం అధ్యయనం జరిపింది. డిసెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల బృందం ప్రకాశం జిల్లాకు వచ్చింది. భూప్రకంపనలు వచ్చిన ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పర్యటించి, భూమి స్థితిగతులను పరిశీలించింది. అనంతరం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానికుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది.