Praveen Pagadala Wife: విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్‌ మరణాన్ని వాడుకుంటున్నారు

2 weeks ago 6
తన భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్‌ భార్య జెస్సికా విజ్ఞప్తి చేశారు. 'మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్‌ మరణాన్ని వాడుకుంటున్నారు. యేసు మార్గాన్ని అనుసరించేవారు మతవిద్వేషాలు రెచ్చగొట్టరు. నా భర్త ప్రవీణ్‌ ఎప్పుడూ మతసామరస్యాన్ని కోరుకునేవారు. నా భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉంది. పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతోంది. ప్రవీణ్‌ మృతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం దారుణం. పోలీసు విచారణకు అందరూ సహకరించాలి' అన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్న ప్రభుత్వానికి ప్రవీణ్‌ సోదరుడు కృతజ్ఞతలు తెలిపారు. 'రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విచారణపై నమ్మకం ఉంది. ప్రవీణ్‌ మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టుకథలతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారు’ అన్నారు.
Read Entire Article