ప్రొద్దుటూరు డీఎస్పీ భావనపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరు డిఎస్పీ భావన లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగంలోకి చేరి మూడు నెలలు గడవక ముందే ఆమె లంచాలు హద్దులు దాటాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి వైన్ షాపు నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. డీఎస్పీ భావన ప్రజల రక్షణను గాలికి వదిలేశారని.. ఇటీవల ఒక రేషన్ బియ్యం లారీ పట్టుకుని స్వలాభం కోసం వదిలేశారని ఆరోపించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ అవినీతిపై త్వరలో అధికారులకు ఫిర్యాదు చేస్తానని వరదరాజుల రెడ్డి తెలిపారు.