చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆటోడ్రైవర్‌గా మారిపోయారు. కార్యకర్తలను వెంటేసుకుని ఆటోను నడిపారు. అయితే ఓ కార్యకర్త కోరిక మేరకు ఆటో నడిపారు పులివర్తి నాని. ఆటోను కొన్న ఆనందంలో ఎమ్మెల్యేకు చూపించాడు ప్రకాష్ అనే కార్యకర్త. అలాగే ఓ సారి తన ఆటో ఎక్కాలని కోరారు. దీంతో అతని ఆటో ఎక్కిన పులివర్తి నాని.. 15 కిలోమీటర్లు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం ఆ ఆటోడ్రైవర్‌కు 500 రూపాయలు బోణీ చేసి అతనిని అభినందించారు.