Pulivendula Municipality Candidate Thugutla Geetha Kumar Win: కడప జిల్లా పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కూటమికి దక్కింది. టీడీపీ అభ్యర్థి గీతాకుమారి 13,875 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై ఘన విజయం సాధించారు. మొత్తం 40 వార్డుల్లో టీడీపీ 34, బీజేపీ 2, జనసేన పార్టీ 1, వైఎస్సార్‌సీపీ 3 చోట్ల విజయం సాధించారు. కడప జిల్లాలో ఇప్పటికే బద్వేల్, రాజంపేట, రాయచోటి, మైదుకూరు మున్సిపాలిటీలను టీడీపీ గెలిచింది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీని బీజేపీ ఖాతాలో చేరాయి.