సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సీఐడీ మాజీ ఛీప్ పీవీ సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే విదేశాలకు వెళ్లారనే ఆరోపణలపై ఆయనపై చర్యలు తీసుకుంది. 2020 నుంచి 2024 మధ్య ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందకుండానే పీవీ సునీల్ కుమార్ ఆరుసార్లు విదేశాలకు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది ఆలిండియా సర్వీసెస్ నిబంధనల ఉల్లంఘనకు వస్తుందంటూ.. ప్రభుత్వం పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.