Hyderabad Ganesh Immersion Python video: హైదరాబాద్ వినాయక నిమజ్జన వేడుకల్లో కొండచిలువను మెడలో వేసుకుని డ్యాన్స్ చేసిన విశాఖపట్నం డ్యాన్స్ బృందం పోలీసులకు చిక్కింది. వైరల్ వీడియో ఆధారంగా మధురానగర్ పోలీసులు, జీహెచ్‌ఎస్‌పీసీఏ అధికారులు ఐదు రోజుల పాటు నిఘా పెట్టి బృందాన్ని గుర్తించారు. వారి వద్ద నుంచి కొండచిలువతో పాటు కోడిని కూడా రక్షించారు. వైద్య పరీక్షల్లో కొండచిలువకు తీవ్రమైన నోటి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. భారతీయ రాక్ పైథాన్ షెడ్యూల్–I రక్షిత వన్యప్రాణి కావడంతో అనుమతి లేకుండా పట్టుకోవడం, కలిగి ఉండటం, ప్రదర్శించడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.