QVSE App Scam: 'రోజుకు రూ.3 వేల ఆదాయం అంటే గుడ్డిగా నమ్మాం..' లక్షల్లో లాభాల ఆశ చూపి రూ. కోట్లకు టోకరా..!

1 month ago 7
Hayathnagar Online Fraud: హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. QVSE యాప్‌లో పెట్టుబడులు పెడితే నెలనెలా భారీ లాభాలు వస్తాయని వెంకటేశ్వరప్ప అనే వ్యక్తి స్థానిక సీఎస్ఆర్ కాలనీ వాసులను నమ్మించి మోసం చేశాడు. స్థానికులు ఒక్కొక్కరు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టగా. సుమారు 800 మంది నుంచి రూ.4–5 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం. ముందు డాలర్లలో రాబడులు చూపించి.. ఆ తర్వాత యాప్‌ను మూసివేసినట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు అడిగితే మరింత పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article