వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో వైసీపీ రాజ్యసభ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి పడిపోయింది. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీసీ ఉద్యమం బలోపేతం చేయడానికి రాజీనామా చేసినట్లు కృష్ణయ్య ప్రకటించారు.