ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్.. రాష్ట్రంలో మళ్లీ వానలు పడనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆదివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేశారు. ఇటీవలే ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.