ఏపీలో రాజ్యసభ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ మూడో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిసెంబర్ పదో తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే సంఖ్యా బలం చూసుకుంటే వైసీపీ ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 2, బీజేపీ ఒక రాజ్యసభ సీటు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.