తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉత్సాహంగా సాగుతోంది. సుమారు 2 లక్షల కార్డులు మంజూరు కాగా.. జూన్ 1 నుండి మూడు నెలల రేషన్ సరుకులు లభిస్తున్నాయి. కేంద్ర ఆదేశాలతో ఈ ప్రక్రియ జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో కార్డులు మంజూరయ్యాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఆన్‌లైన్‌లో, మీసేవా కేంద్రాల ద్వారా తమ రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకుంటున్నారు. వీటి ద్వారానే కాకుండా.. రేషన్ షాపుల వద్ద కూడా ఆధార్‌తో స్టేటస్ తెలుసుకోవచ్చు.