Ration Cards: తెలంగాణలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రకటన చేసింది. అర్హులైన వారందరికీ అక్టోబర్ నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయనున్నట్లు ప్రకటించింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ.. తాజాగా భేటీ అయి ఈ నిర్ణయం తీసుకుంది.