Revanth Reddy: ఢిల్లీలో ప్రధాని మోదీతో.. సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అనేక విషయాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణకు అన్నివిధాలుగా చేయూతను అందించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించిన విషయాలను ప్రధానికి సీఎం చెప్పారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఇక మూసీ నది ప్రక్షాళనకు సహాయం అందించాలని కోరారు.