తిరుపతి తొక్కిసలాట ఘటనలో తన మనుషులను కాపాడుకునేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా ఆరోపించారు. ఘటన జరిగి మూడురోజులైనా కూడా కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు ప్రచార యావ కూడా కారణమన్న రోజా.. ఈ కేసులో చంద్రబాబే తొలి ముద్దాయి అని ఆరోపించారు. తప్పు జరిగితే కులంతో సంబంధం లేకుండా శిక్షించాలన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏ కులానికి భయపడుతున్నారని రోజా నిలదీశారు.