తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్యను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. సాధారణ ఉద్యోగుల బదిలీల్లో భాగంగా మాత్రమే లక్ష్మీబాయిని ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే తన భార్యను కావాలనే ట్రాన్స్‌ఫర్ చేశారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇది చాలా అన్యాయమంటూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.