విశాఖలోని రుషికొండ భవనాలపై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొడం భవనాల మీద సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని చెప్పారు. త్వరలోనే రుషికొండ భవనాలపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. విశాఖలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి.. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ గురించి ప్రస్తావించారు. విదేశాల్లో ఘన వ్యర్థాల నిర్వహణలో దుర్వాసన ఉండదన్న నారాయణ.. అదే పద్ధతి ఏపీలోనూ తెస్తామన్నారు.