తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ వినిపించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం భారీగా ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, కాచిగూడ, హైదరాబాద్ నుంచి కొట్టాయం, కొల్లాం వరకూ ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.