సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై నమోదైన కేసును కొట్టేసేలా ఆదేశించాలని కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై జరిగింది హనీట్రాప్ అని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఘటన వెనుక నిజానిజాలు తేల్చకుండా పోలీసులు కేసు నమోదు చేశారని.. ఆ కేసును కొట్టివేయాలని ఆదేశించాలంటూ కోనేటి ఆదిమూలం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కోనేటి ఆదిమూలం తనను బెదిరించి, లొంగదీసుకున్నారంటూ టీడీపీ మహిళా నేత కేసు పెట్టిన సంగతి తెలిసిందే.