సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ చట్టం అమలుపై విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ స్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేసుల నమోదు, దర్యాప్తు, విచారణ, పరిహారం, బాధితుల పునరావాసంపై అధికారులతో సీఎం సమీక్ష చేశారు. అట్రాసిటీ ఘటనల్లో బాధితులకు నష్టపరిహారం, సహాయాన్ని బడ్జెట్ కోసం ఎదురుచూడకుండా గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే అందించాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.