schools holiday: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

1 year ago 17
ఫెంగల్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కొనసాగుతోంది. తుపాను తీరం దాటినప్పటికీ దీని ప్రభావంతో సోమవారం కూడా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం సెలవు ఇస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ ప్రకటించారు. మరోవైపు వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాలలోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article