SCR Railway: కొత్త సంవత్సరం వేళ దక్షిణ మధ్య రైల్వే కీలక విషయం వెల్లడించింది. జనవరి 1వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్ల వేళల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపింది. కొన్ని రైళ్లను ముందుగా.. మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడపనున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లోనూ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.