Seethakka: మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీతక్క.. నియోజకవర్గ ఇంఛార్జ్‌ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను కొన్ని రోజుల తర్వాత బాధ్యతల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి గురించి పూర్తిగా వివరిస్తానని వెల్లడించారు.