తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణల కేసు మరో ట్విస్ట్ తీసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ విచారణకు బ్రేక్ పడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మూడో తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా సిట్ దర్యాప్తు కొనసాగిస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ తరుఫు న్యాయవాదుల సూచనల మేరకు సిట్ దర్యాప్తును తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు వెల్లడించారు.