నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను ప్రాణాలతో రక్షించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. టన్నెల్‌లో ఒకవైపు నుంచి నీరు లీక్ అయ్యి మట్టి కుంగిందని.. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి కొందరు కార్మికులను బయటకు పంపించారన్నారు. కార్మికులను కాపాడేందుకు NDRF, ఆర్మీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తామన్నారు.