ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు శరవేగంగా సాగుతున్నాయి ప్రమాదం జరిగి 13 రోజులు గడుస్తున్నా వారి జాడ కనుక్కోలేకపోవటంతో.. రంగంలోకి జాగిలాలలను దింపారు. కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో రెండు కేడవర్ డాగ్స్‌ని తీసుకువచ్చారు. కేరళ ప్రత్యేక పోలీసుు, జిల్లా కలెక్టర్ సంతోష్ కలిసి విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మరోవైపు.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సమస్యాత్మకంగా మారిన బురద, మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్‌లను వినియోగిస్తున్నారు.