SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ కడావర్ డాగ్స్ స్క్వాడ్ గుర్తించిన రెండో ప్రాంతంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. అక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉండటంతో సహాయక చర్యల కోసం రోబోలను రంగంలోకి దించారు. ఓ రోబోతో 110 మంది రెస్క్యూ సిబ్బంది సొరంగంలోకి వెళ్లారు. సొరంగం లోపల నీరు, బురద పరిస్థితులు సవాలుగా మారాయి. దీంతో రెస్క్యూ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం రోబోలను మోహరించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మిగిలిన ఏడుగిరి కోసం అన్వేషణ కొనసాగుతోంది.