నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగి రెండ్రోజులు గడుస్తున్నా.. లోపలే చిక్కుకున్న ఆ 8 మంది జాడ ఇంకా దొరకలేదు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకమేర్పడుతోంది. దీంతో ఆ 8 మంది ఎలా ఉన్నారో అనే ఆందోళన నెలకొంది.