ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యవేక్షించారు. సీనియర్ నేత జానారెడ్డితో కలిసి పర్యవేక్షించిన అనంతరం.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లంతా బయటికి వస్తారని చిన్న ఆశ ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరగటం ఇదే మొదటిసారి అని.. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయటం సరికాదని చెప్పుకొచ్చారు.