హైదరాబాద్ గచ్చిబౌలిలో కన్నడ నటి శోభిత (32) ఆత్మహత్య చేసుకుంది. భర్తతో కలిసి గచ్చిబౌలిలోని ఓ అపార్ట్ మెంట్‌లో నివాసముంటున్న శోభిత.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మొన్నటివరకు భార్యభర్తలిద్దరూ కలిసి గోవా టూర్‌కు వెళ్లగా.. ఒకటీ రెండు రోజుల క్రితమే వచ్చినట్టు తెలుస్తోంది. కన్నడ సీరియల్స్, సినిమాల్లో నటించిన శోభిత.. తెలుగులోనూ పలు సీరియళ్లు, సినిమాల్లో నటించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.