ఆగస్ట్ 15తో పాటుగా వరుసగా సెలవులు రావటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాందేడ్ -శ్రీకాకుళం రోడ్ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఆగస్ట్ 14న నాందేడ్ నుంచి బయల్దేరనున్న రైలు.. ఆగస్ట్ 15 మధ్యాహ్నానికి శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరి ఆగస్ట్ 16వ తేదీ మధ్యాహ్నానికి నాందేడ్ చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.