SRH vs RCB మ్యాచ్.. క్రికెట్ అభిమానలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

3 months ago 16
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈనెల 22న జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. అధికారిక టికెటింగ్ భాగస్వామి డిస్ట్రిక్ట్ యాప్‌ను పోలిన నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లను సృష్టించి తక్కువ ధరకే టికెట్లంటూ సోషల్ మీడియాలో మోసపూరిత లింకులు పంపుతున్నారు. ఈ నకిలీ లింకులను క్లిక్ చేస్తే డబ్బుతో పాటు బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్ల పరమవుతాయని అభిమానులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రత్యేక ట్వీట్ ద్వారా హెచ్చరించారు.
Read Entire Article