నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో కనిపించే చిరుత పులి.. ఈసారి పూజారి ఇంటి ఆవరణలో ప్రత్యక్షమైంది. శ్రీశైలం ఆలయ పూజారి సత్యనారాయణ పాతాళగంగ మెట్లమార్గంలో నివశిస్తు్న్నారు. అయితే సోమవారం అర్థరాత్రి ఆయన ఇంటి ఆవరణలోకి చిరుత పులి ప్రవేశించింది. ఇంటి పరిసరాల్లో చిరుత సంచరించడం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే చిరుత వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.