Srisailam: మల్లిఖార్జునస్వామికి టీడీపీ ఎమ్మెల్యే భారీ విరాళం.. బంగారు వస్తువులు అందజేత..

2 months ago 5
JC Family Donation to Srisailam Temple: శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి బంగారు వస్తువులు విరాళంగా అందాయి. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. శ్రీశైలం దేవస్థానానికి బంగారు వస్తువులను కానుకగా అందజేశారు. బంగారంతో చేయించిన కూర్మ సింహాసనం , పల్లెం దేవస్థానానికి అందజేశారు. శుక్రవారం శ్రీశైలం దేవస్థానాన్ని కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు జేసీ అస్మిత్ రెడ్డి. అనంతరం ఈవోను కలిసి బంగారు వస్తువులు అందజేశారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు హైదరాబాద్ వాసి కూడా శ్రీశైలంలోని దవాఖానాకు వైద్య పరికరాలు విరాళంగా అందించారు.
Read Entire Article