శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో కొత్త కార్యక్రమం తీసుకువచ్చింది. శ్రీవారి వైద్యసేవ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. శనివారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ద్వారా.. శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించవచ్చు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక అప్లికేషన్ కూడా తీసుకువచ్చింది.