Super Six Guarantees: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. మొన్నటివరకు సంక్రాంతి పండగ సందర్భంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు వార్తలు రాగా.. తాజాగా మరోసారి ఆ హామీ అమలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కాకుండా ఉగాది పండగ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నట్లు సమాచారం.