కంచ గచ్చిబౌలిలోని భూముల వివాదంపై సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. అటవీ భూమిలో అనుమతి లేకుండా వందల ఎకరాల చెట్లు తొలగించే అంశంపై ప్రభుత్వ చర్యలను సీరియస్‌గా ప్రశ్నించింది. ప్రభుత్వం తక్షణమే చర్యలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని.. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి.. తదుపరి విచారణ తేదీని ఈ నెల 16కి వాయిదా వేసింది.