తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వారి పదవీ విరమణ వయస్సను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లుగా ఉన్న రిటైర్మెంట్ ఏజ్‌ను 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు గురవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేడు ఐదుగురు ప్రొఫెసర్లు రిటైర్మెంట్ కావాల్సి ఉంటగా.. ప్రభుత్వ నిర్ణయంతో వారు మరో ఐదేళ్ల పాటు భోదనా వృత్తిలో కొనసాగనున్నారు.