టీడీపీ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాపై సస్పెన్స్‌కు తెరపడింది. ఎవరికి ఛాన్స్ వస్తుందోనంటూ గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు సీఎం నారా చంద్రబాబు నాయుడు తెరదించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి ముగ్గురు పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఇప్పటికే ఒక సీటును జనసేనకు కేటాయించగా.. ఇప్పుడు మరో సీటును బీజేపీకి కేటాయించారు.